తమ్ముడికి చిరు అభినందన..

  • Publish Date - October 15, 2020 / 06:58 PM IST

Megastar Chiranjeevi: మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవల కోవిడ్‌-19 బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్‌ నుంచి కోలుకున్న నాగబాబు.. వెంటనే తన ప్లాస్మాను చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు దానం చేశారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ఉచితంగా ప్లాస్మా దానం చేస్తున్న విషయం తెలిసిందే. నాగబాబు ప్లాస్మా దానం చేశారని తెలిసి, మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముణ్ణి అభినందిస్తూ.. ట్వీట్ చేశారు.


‘‘కోవిడ్‌ 19తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌లో ప్లాస్మా డొనేట్‌ చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి. ప్లాస్మా దానం చేయండి..’’ అని చిరు ట్వీట్‌ చేశారు.