కరోనా ఎఫెక్ట్ – మెగాస్టార్ చిరంజీవి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేస్తూ వీడియో విడుదల చేశారు..
కరోనా వైరస్ కారణంగా తన కొత్త సినిమా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా వేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ‘మనకేదో అయిపోతుంది అనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ పనికిరావు..
జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత దూరంగా ఉండండి.. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితమవడం ఉత్తమం’.. అంటూ వ్యక్తిగతంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియచేశారు చిరు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. విదేశాల నుంచి రాకపోకలను నిలిపి వేసింది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. జాగ్రత్తలు తీసుకునేలా ‘హోం క్వారంటైన్ స్టాంప్’ క్యాంపెయిన్ చేపట్టిన్ సంగతి తెలిసిందే.
A word of caution from Mega Star Chiranjeevi. Stay safe. #Covid19 #Covid19India pic.twitter.com/oBMjYlxkDB
— BARaju (@baraju_SuperHit) March 19, 2020