Chiranjeevi : నేను బ్లడ్ అమ్ముకున్నానా? ఆరోపణలపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్..
ఈ ఈవెంట్లో చిరంజీవి పలు అంశాలపై మాట్లాడుతూ బ్లడ్ అమ్ముకున్నాడు అనే ఆరోపణలపై కూడా రియాక్ట్ అయ్యారు. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటనతోనే కాక అనేక సేవా కార్యక్రమాలతో కూడా ప్రజలకు దగ్గరయ్యారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ని రక్తదానంలో భాగస్వామ్యం చేసారు. అయితే చిరు అంటే గిట్టని వాళ్ళు కొంతమంది చిరంజీవి రక్తం అమ్ముకున్నారు అని గతంలో ఆరోపణలు చేసారు. తాజాగా చిరంజీవి దీనిపై స్పందించారు.
చిరంజీవి సేవలకు, చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయినందుకు మెగా ఫాన్స్ యూత్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చిరంజీవి పలు అంశాలపై మాట్లాడుతూ బ్లడ్ అమ్ముకున్నాడు అనే ఆరోపణలపై కూడా రియాక్ట్ అయ్యారు.
Also Read : Nakshatra : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో తెలుగమ్మాయి.. తెల్లకాగితం ఈవెంట్లో ‘నక్షత్ర’.. ఫొటోలు
చిరంజీవి మాట్లాడుతూ.. నా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. నాకు అవమానాలు లేవు అనుకుంటున్నారా. ఇదే బ్లడ్ మీద కూడా అన్నారు. బ్లడ్ అమ్ముకుంటున్నారు అని అన్నారు. నా రెమ్యునరేషన్ ముందు ఆ సంపాదన ఏపాటిది. ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నా రెమ్యునరేషన్ తో సమానం అవుతుంది. నేను బ్లడ్ అమ్ముకున్నానా? అలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వం. చెయ్యి చాచి డొనేషన్స్ కూడా తీసుకోకుండా నా కష్టార్జితం, ఫ్యాన్స్ సపోర్ట్ తోనే బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాను. అందుకే అలాంటి విమర్శలు పట్టించుకోవట్లేదు అని అన్నారు.
