Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లి పలు కారణాలతో రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారని అందరికి తెలుసు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి పెద్దగా సినిమాల గురించి పట్టించుకోలేదు. మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్.(Chiranjeevi)
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ అనంతరం పలువురు మీడియా ప్రతినిధులతో చిరంజీవి మాట్లాడుతూ రీ ఎంట్రీ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
Also See : Sneha : ఫ్యామిలీతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్నేహ.. ఫొటోలు చూశారా..?
చిరంజీవి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ల పాటు సినిమాలతో పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యాను. ఇండస్ట్రీని మిస్ కాలేదు కానీ మర్చిపోయాను. రీ ఎంట్రీ సమయంలో ఖైదీ నెంబర్ 150 సినిమాకు హీరోయిన్ గా కాజల్ ను తీసుకుంటామని చెబితే కాజలా.. ఎవరు ఆ అమ్మాయి అని అడిగాను. తమన్నా కూడా అప్పుడు నాకు తెలియదు. అంతగా సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యాను అని తెలిపారు.
దాదాపు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ ఇలా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయ్యాను, సినిమా విషయాలు మర్చిపోయాను అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. గతంలో అప్పటికే కాజల్ రామ్ చరణ్ తో మగధీరలో నటించి ఉండటం గమనార్హం.
Also Read : Chiranjeevi : పవన్ కళ్యాణ్ కే ఆ సమర్థత ఉంది.. రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. చిరంజీవి కామెంట్స్ వైరల్..