Chiranjeevi : మీలాంటి అభిమాని ఉండటం ఆనందం.. డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చి స్పెషల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..

ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్టర్ అయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా మెగాస్టార్ ని కలిసి స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నారు.

Megastar Chiranjeevi Special Gift to Director Sekhar Kammula and Appreciates for Completing 25 Years

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి ఆయనే అభిమాన హీరో. ఆయన్ని ప్రేరణగా తీసుకొని సినీ పరిశ్రమలోకి వచ్చినవాళ్లు వేలల్లో ఉన్నారు. చాలా మంది దర్శకులు కూడా అయన ప్రేరణతోనే వచ్చి ఆయనతో కలిసి పనిచేసారు కూడా. అయన అభిమానుల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకరు.

ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్టర్ అయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా మెగాస్టార్ ని కలిసి స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈయనతో సినిమా తీయాలి అనుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయింది అని చెప్పడంతో కొన్ని జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి మెగాస్టార్ ని కలిసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు శేఖర్ కమ్ముల.

Also See : ‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ చూశారా? మరోసారి బాబాయ్ – అబ్బాయి ఫైట్..

తాజాగా చిరంజీవి శేఖర్ కమ్ములకు స్పెషల్ పెన్ గిఫ్ట్ ఇచ్చారు. శేఖర్ కమ్ములతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మై డియర్ శేఖర్.. మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి ఇచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ళ జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు వ్రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ఒక మైల్ స్టోన్ ని చేరుకున్నందుకు అభినందనలు. ఇంకో 25 ఏళ్ళు కూడా ఇలాగే ముందుకువెళ్లాలి అని రాసుకొచ్చారు.

మెగాస్టార్ డైరెక్టర్ కి పెన్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ఆయన్ని అభినందిస్తూ అభిమాని అంటూ పోస్ట్ చేయడంతో చిరుని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read : Kamal Haasan : క‌న్న‌డ ప్ర‌జ‌ల వైపే హైకోర్టు.. క‌మ‌ల్ హాస‌న్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే..