Kamal Haasan : కన్నడ ప్రజల వైపే హైకోర్టు.. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే..
స్టార్ హీరో కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

You may be Kamal Haasan but cant hurt sentiments Karnataka High Court raps
స్టార్ హీరో కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళం నుండి కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. మీరు ఏమైనా చరిత్ర కారులా? లేక భాషావేత్తనా? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు? అని ప్రశ్నించింది. ఎంత పెద్ద నటుడైనా సరే ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారం అయ్యేవని తెలిపింది.
కమల్ హాసన్ నటించిన థగ్ లైప్ చిత్ర ప్రదర్శనను నిషేదిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థగ్ లైఫ్ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కమల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
The Raja Saab : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
‘మీరు కమల్ హాసన్ కావొచ్చు లేదా ఇంకా పెద్ద నటుడైనా కావచ్చు. అయితే.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మాత్రం మీకు లేదు. ఓ ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ వ్యాఖ్యల వల్ల అశాంతి ఏర్పడింది. ఇక మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. మీరు ఏ ప్రాతిపాదికపన ఆ వ్యాఖ్యలు చేశారు? మీరు ఏమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమీ అడిగారు. క్షమాపణలు మాత్రమే కదా. ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది.’ అని న్యాయస్థానం తెలిపింది.