Chiranjeevi – Prabhas : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్.. ప్రభాస్‌కు మెగాస్టార్ స్పెషల్ విషెస్..

మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి స్పెషల్ గా తన సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు.

Megastar Chiranjeevi Special Wishes to Prabhas on his Birthday Tweet goes Viral

Chiranjeevi – Prabhas : నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దేశమంతా అభిమానులను సంపాదించుకున్నాడు. విదేశాల్లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఇక అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Prabhas Fans : అర్ధరాత్రి పోలీసులతో ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ.. ప్రభాస్ ఇంటి వద్ద భారీ జనాలు..

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి స్పెషల్ గా తన సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. చిరంజీవి.. ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్. అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్. ప్రేమ, సంతోషాలతో మరింత గొప్పగా ఎదగాలి అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ప్రభాస్ అభిమానులు తమ డార్లింగ్ కి విషెష్ చెప్పినందుకు చిరంజీవికి థ్యాంక్స్ చెప్తూ ఆ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు.