Chiranjeevi : సునీత విలియమ్స్ పై మెగాస్టార్ ట్వీట్.. అడ్వెంచర్ మూవీ అంటూ..

మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియన్స్ గురించి ట్వీట్ చేసారు.

Megastar Chiranjeevi Tweet on Sunita Williams Return to Earth Tweet goes Viral

Chiranjeevi : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి వచ్చారు. తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ప్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు.

సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో అనేక మంది భారతీయులు కూడా ఆమెని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా సునీత విలియమ్స్ కి స్వాగతం పలికారు.

Also Read : SSMB 29 : ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ సినిమా.. వాలీబాల్ ఆడిన రాజమౌళి.. ఫోటోలు, వీడియోలు వైరల్..

మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియన్స్ గురించి ట్వీట్ చేసారు. చిరంజీవి తన ట్వీట్ లో.. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కు భూమిపైకి స్వాగతం. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు. ఇది నిజమైన బ్లాక్ బస్టర్. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలి అంటూ రాసుకొచ్చారు.