Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అయితే గ్లింప్స్ రిలీజ్ చేయగా అందులో VFX మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ యూనిట్ మరింత జాగ్రత్తపడి పోస్ట్ ప్రొడక్షన్ ని జాగ్రత్తగా చేస్తుంది. ఆగస్టు లో ఈ సినిమా రిలీజవుతుందని టాక్ వినిపిస్తుంది.
విశ్వంభర సినిమా నుంచి రామ రామ అంటూ ఓ పాట కూడా రిలీజ్ అయింది. అయితే తాజాగా మూవీ యూనిట్ ఓ మంచి ప్రయత్నం చేస్తుంది. విశ్వంభర సినిమా ‘రామ రామ’ సాంగ్ ని పెన్‌డ్రైవ్స్ లో స్టోర్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఆలయాల్లో రెగ్యులర్ గా ప్లే చేయడానికి, లేదా వాళ్ళ ఇళ్లల్లో అయినా ప్లే చేయడానికి ఈ పెండ్ డ్రైవ్స్ ని ఇస్తున్నారు. ఇప్పటికే ఈ పెన్ డ్రైవ్స్ ని రెడీ చేసారు కూడా.
విశ్వంభర సినిమా నుంచి ‘రామ రామ’ అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ పాటని పెన్‌డ్రైవ్స్ లో నిక్షిప్తం చేసి, తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు.
ఓరకంగా మంచి ప్రయత్నం..
మరో రకంగా కావల్సినంత పబ్లిసిటీ!#vishwambhara… pic.twitter.com/PqTpUhUTZu
— Telugu360 (@Telugu360) April 29, 2025
Also Read : Rithu Chowdary : అతను ఉంటేనే జబర్దస్త్ చేస్తాను.. లేకపోతే చేయను.. జబర్దస్త్ పై రీతూ చౌదరి కామెంట్స్..
దీంతో ఆలయాల్లో రామ నామం వినిపించడానికి చేసే మంచి ప్రయత్నంతో పటు సినిమాకు కూడా పబ్లిసిటీ వస్తుంది అంటున్నారు. ఇలాంటి మంచి పనిచేస్తున్నందుకు మూవీ యూనిట్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. మీరు కూడా విశ్వంభర సినిమా నుంచి రామ రామ సాంగ్ వినేయండి..
https://www.youtube.com/watch?v=7GKYw1B48o8