×
Ad

Arjun Chakravarthy : అర్జున్ చక్రవర్తి నుంచి ఫ‌స్ట్ సింగిల్.. ‘మేఘం వర్షించదా..’

విజయ రామరాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి.

Megham Varshinchada Full Video Song

విజయ రామరాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 29న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా ఇటీవ‌ల టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్, యూట్యూబ్‌ లో 1.5 మిలియన్లు వ్యూస్ ను తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొద‌టి పాట మేఘం వర్షించదా విడుద‌ల చేశారు.

Actor Shwetha Menon: సినిమాల్లో అశ్లీల, అసభ్యకర కంటెంట్..! నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదు..

విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ ఈ పాట‌ను పాడారు.

ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇప్పటికే 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.