Student Teaser : ‘స్టూడెంట్’ టీజర్ వచ్చేసింది.. శ్రీహరి కొడుకు అదరగొట్టాడుగా..

మీరు కూడా ఈ స్టూడెంట్ టీజర్ చూసేయండి.. (Student Teaser)

  • Published on- June 28, 2026 / 06:16 PM IST

Student Teaser

Student Teaser : దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తుండగా శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మాణంలో బాలు తత్వమసి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ చూస్తుంటే.. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ (మేఘాంశ్ శ్రీహరి) సడెన్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అని పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. శ్రీహరి తనయుడు మేఘాంశ్ పవర్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడని అర్ధమవుతుంది.

Also See : Roopaa Srinivas : హ్యాపీ జర్నీ అంటున్న కొత్త నటి.. రూప శ్రీనివాస్ ఫొటోలు..

మీరు కూడా ఈ స్టూడెంట్ టీజర్ చూసేయండి..