Nupur Shikhare Memes: అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సీన్ నిజ జీవితంలో రిపీట్ అయిందా? అందుకే పెళ్లిలో ఇలా..

ఆ సినిమాలో గ్రీన్ చట్నీపై ఇస్త్రీ పెట్టెను ఉంచుతారు. పెళ్లి కొడుకు షేర్వానీపై ఆ వేడి వేడి ఇస్త్రీ పెట్టెను పెడతారు. దీంతో పెళ్లి కొడుకు చాలా సేపు రూమ్ లోనే ఉండి..

Nupur Shikhare marries Ira Khan

Nupur Shikhare: వివాహానికి పెళ్లికొడుకు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి పరిణయమాడడం మనం చూస్తూనే ఉంటాం. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్‌ను పెళ్లి చేసుకున్న నూపుర్ శిఖరే మాత్రం.. వెస్ట్, షార్ట్‌తోనే వివాహ వేదికపైకి వచ్చి అందరికీ షాక్ ఇవ్వడంతో దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్ వెస్ట్, వైట్ షార్ట్‌తోనే వచ్చిన నూపుర్ శిఖరే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మన దేశంలో ఎన్నడూ చూడలేమనుకున్న వింతలను చూస్తున్నామంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్వించే మీమ్స్ సృష్టిస్తున్నారు. అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమాలో పెళ్లి కొడుకు దుస్తులను పాడుచేస్తారని గుర్తు చేశారు నెటిజన్లు.

ఆ సినిమాలో గ్రీన్ చట్నీపై ఇస్త్రీ పెట్టెను ఉంచుతారు. పెళ్లి కొడుకు షేర్వానీపై ఆ వేడి వేడి ఇస్త్రీ పెట్టెను పెడతారు. దీంతో షేర్వానీ పాడైపోతుంది. పెళ్లి కొడుకు చాలా సేపు రూమ్ లోనే ఉండి, చివరకు షెర్వానీ వేసుకోకుండానే బయటకు పరిగెత్తుకొస్తాడు. ఇప్పుడు కూడా నూపుర్ షెర్వానీపై అమీర్ ఖాన్ ఉద్దేశపూర్వకంగానే గ్రీన్ చట్నీ చల్లడంతో అతడు కూడా షెర్వానీ వేసుకోకుండానే.. పెళ్లికి వచ్చి ఉండొచ్చని కొందరు సెటైర్లు వేశారు.

చాలా ఖరీదైన షేర్వాణిని పెళ్లికి వేసుకురావాలని అమీర్ ఖాన్ షరతు పెట్టాడని, అంత ఖర్చు భరించలేక పెళ్లి కొడుకు వెస్ట్, షార్ట్‌తోనే వివాహానికి వచ్చాడని తెలుపుతూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారు. పొద్దునే జాకింగ్‌కు వెళ్లి అక్కడి నుంచి పెళ్లికి పరిగెత్తుకుంటూ వరుడు వచ్చాడని కొందరు మీమ్స్ సృష్టించారు.

Nupur Shikhare : బనియన్, షార్ట్ మీద వచ్చి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ అల్లుడు