Mirai OTT Release: బ్లాక్ బస్టర్ మిరాయ్ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పటినుండో తెలుసా?

బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. (Mirai OTT Release)సెప్టెంబర్ 12న రిలీజ్ అయినా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

mirai movie ott release and streaming details

Mirai OTT Release: బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయినా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఎక్కడ చూసినా మిరాయ్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. టాలీవుడ్ సెలెబ్రెటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో ఈ సినిమా బ్లక్సాఫీష్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. సినిమాపై ఏర్పడిన భారీ హైప్ తో మొదటిరోజు ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది మిరాయ్. రికార్డ్ అన్ని ఎందుకు అన్నాం అంటే. ఈ సినిమాకు ఎలాంటి టికెట్ హైక్ లేదు. నార్మల్ రేట్స్ తోనే మొదటి రోజు ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాదు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. స్టార్ కంటెస్టెంట్ అవుట్.. ట్విస్ట్ అదిరింది!

ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు యునానిమస్ పాజిటీవ్ టాక్ వచ్చింది కాబట్టి, రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమా తేజ సజ్జ చేసిన గత బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ కలెక్షన్స్ ను దాటేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మిరాయ్ సినిమా ఓటీటీ విడుదల గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, మిరాయ్ ఓటీటీ హక్కులను(Mirai OTT Release) ప్రముఖ సంస్థ జియో ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాకు పాజిటీవ్ రిపోర్ట్ వస్తే కనీసం ఆరు వారల తరువాతనే ఓటీటీ స్ట్రీమ్ చేయాలి. ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం ఇరవై రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారట. కానీ, ఇప్పుడు మిరాయ్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి, ఈ సినిమా ఓటీటీలోకి రావటానికి మినిమమ్ నెలరోజులకు పైనే పట్టే అవకాశం ఉంది. మరి మొదటిరోజే సూపర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.