TG Vishwa Prasad: మొత్తం రూ.140 కోట్ల నష్టం.. ఇంకా రికవరీ అవలేదు.. మిరాయ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

మిరాయ్ సినిమాతో తమ సంస్థలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad). కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.

Mirai movie producer loses Rs 140 crores due to six movies

TG Vishwa Prasad: మిరాయ్ సినిమాతో తమ సంస్థలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం అయిదు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో, మూవీ టీం ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ సంస్థలో వచ్చిన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ సంస్థ నుంచి వచ్చిన గత ఆరు సినిమాల వల్ల ఆయన ఏకంగా రూ.140 కోట్ల నష్టాలను చవిచూశారట. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Badass: బ్యాడాస్ మూవీ టీం కాస్టింగ్ కాల్.. సిద్దు జొన్నలగడ్డతో నటించే అవకాశం

ఈ ఇంటర్వ్యూలో నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad) మాట్లాడుతూ.. 2021-2023 మధ్యకాలంలో నాన్-థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ, 2024కి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. దాంతో, సినిమాల నాన్-థియేట్రికల్ హక్కులను అమ్మడం ఇబ్బందిగా మారింది. ఆ కారణంగానే ఆరు సినిమాలకు గాను ఏకంగా రూ.140 కోట్ల వరకు నష్టపోయాను. వాటిలో ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్, స్వాగ్, విశ్వం, వడక్కుపట్టి రామసామి వంటి సినిమాలు ఉన్నాయి. ఈ ఆరు సినిమాలు థియేట్రికల్ పరంగా మంచి విజయాన్ని సాధించాయి. కానీ, ఓటీటీ హక్కుల డిమాండ్ తగ్గడం వల్ల భారీ నష్టం వచ్చింది. ఈ నష్టాల నుంచి ఇంకా రికవరీ అవలేదు. 2024లో విడుదలైన ధమాకా సినిమా మాత్రంమే లాభాలు తెచ్చిపెట్టింది” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఓటీటీ సంస్థల క్యాలెండర్ ప్రకారం సినిమాలను విడుదల చేయడం వల్ల కూడా నష్టాలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఉంటే భవిష్యత్తులో కష్టం అవుతుందని, ఓటీటీ మార్కెట్ పరిస్థితులను బట్టి మాత్రమే తమ సినిమాల నిర్మాణం, విడుదలలను ప్లాన్ చేసుకోవాలని నిర్మాతలు అర్థం చేసుకోవాలని విశ్వప్రసాద్ సూచించారు. ఇక మిరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాలుగు భారీ సినిమాలు రానున్నాయి. వాటిలో జాంబీ రెడ్డి 2,రణమండల, కాలచక్ర, పినాక లాంటి సినిమాలు ఉన్నాయి.