Mirai ticket rates reduced on the occasion of Dussehra festival
Mirai: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా మిరాయ్. ఫాంటసీ అండ్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. మొదటిరోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో, తేజ సజ్జ కెరీర్ మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది మిరాయ్. అయితే, తాజాగా మిరాయ్ టీం సినీ లవర్స్ కి పండుగ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమా(Mirai) టికెట్స్ రేట్స్ ను భారీగా తగ్గిస్తూ ప్రకటన చేసింది.ఇందులో భాగంగా బాల్కనీ టికెట్ ధరను రూ.150, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా నిర్ణయించింది. దీంతో, చాలా మంది ఈ సినిమాను మళ్ళీ చూసే అవకాశం దక్కనుంది.
Sai Pallavi: అవి Ai ఫోటోలు కాదు రియల్.. బీచ్ ఫోటోలపై సాయి పల్లవి రియాక్షన్
అలాగే ఓటీటీలో చూద్దాం అని చూడకుండా ఉన్నవారు కూడా ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి, ఆడియన్స్ మళ్ళీ మిరాయ్ థియేటర్స్ కి క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి తొలగించిన వైబుంది బేబీ అనే సాంగ్ ను థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు మేకర్స్. ఈ విషయంపై కూడా తాజాగా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. నిజానికి విడుదలకు ముందే ఈ పాట చాట్ బస్టర్ గా నిలిచింది. కానీ, సినిమాలో ఆ సాంగ్ లోకేపోవడంతో చాలా మంది ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వారంతా హ్యాపీ ఫీలవుతున్నారు. మళ్ళీ థియేటర్స్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
మరి, పీపుల్ మీడియా వేసిన ఈ కొత్త ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ బ్లాక్ స్వార్డ్ పాత్రలో కనిపించాడు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ అడ్వెంచరస్ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. సీనియర్ నటి శ్రీయా కీలక పాత్ర పోషించారు.