Mithun Chakraborty : ప్ర‌ముఖ న‌టుడు మిథున్‌ చక్రవర్తిని వ‌రించిన‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’

సినీ రంగంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని వ‌రించింది.

Mithun Chakraborty got Dadasaheb Phalke Award union minister ashwini vaishnaw tweets

Mithun Chakraborty : సినీ రంగంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఈ ఏడాది ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని వ‌రించింది. ఈ విష‌యాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. అక్టోబ‌ర్ 8న జ‌రిగే 70వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల వేడుక‌లో ఈ పుర‌స్కారాన్ని ఆయ‌న అందుకోనున్న‌ట్లు కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశౄరు.

‘‘మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది’’ అని వైష్ణ‌వ్ సోష‌ల్ మీడి్యాలో రాసుకొచ్చారు.

SWAG Trailer : శ్రీ విష్ణు ‘స్వాగ్’ ట్రైల‌ర్.. అదిరిపోయిందిగా..

ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో న‌టించారు. హీరోగానే కాకుండా స‌హాయ‌న‌టుడిగా, విల‌న్‌గా త‌నదైన ముద్ర వేశాడు. 1976లో ‘మృగాయ’తో న‌టుడిగా మారారు. మొద‌టి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

హిందీలోనే కాకుండా బెంగాలీ, క‌న్న‌డ‌, తెలుగు, ఒరియా, భోజ్‌పురి బాష‌ల్లోనూ ఆయ‌న న‌టించారు. త‌న కెరీర్‌లో మూడు సార్లు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

NTR – Politics : పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఓటర్లుగా మారరు..