Veede Mana Varasudu : ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా.. వీడే మన వారసుడు..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయిన MLA మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ..

Veede Mana Varasudu

Veede Mana Varasudu : రైతుల జీవితాలపై తెరకెక్కుతున్న సందేశాత్మక సినిమా ‘వీడే మన వారసుడు’. అర్.ఎస్ ఆర్ట్స్ బ్యానర్ పై రమేష్ ఉప్పు మెయిన్ లీడ్ లో నటిస్తూ ఈ సినిమాని దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్నాడు. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్, సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 18న తెలుగులో ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయిన MLA మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. అంతా తానే అయి సినిమాను తీసిన ఉప్పు రమేష్ ను అభినందిస్తున్నాను. రమేష్ ఉప్పు 1994లో నాకోసం పాటలు చేసేవారు. ప్రతిభ ఉన్న కళాకారుడు. ఆయన కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఒంటరిగా సినిమాల్లో వచ్చిన రమేష్ ఉప్పు అసలైన సినీ వారసుడిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

Also Read : Prabhas – Allu Arjun : మొన్న అల్లు అర్జున్ సినిమా ఎన్టీఆర్ కు.. ఇప్పుడు ప్రభాస్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేతికి..

పోలీసు ఆఫీసర్ రామావత్ తేజ మాట్లాడుతూ… సినిమాను హిట్టు చేయాలని ఇక్కడికి అందరు న్యాయ బద్దంగా వచ్చారు. నేను చట్టబద్దంగా వచ్చాను. సినిమా హిట్ అయి తీరుతుంది అని అన్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన‌ ఈ కుటుంబ క‌థా చిత్రాన్ని థియేట‌ర్‌కు వెళ్లి చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని తెలిపారు.

Also See : Anupama Parameswaran : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చీరకట్టులో అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..