టిక్‌టాక్‌లోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు..
లాక్‌డౌన్ పుణ్యమా అని సెలబ్రిటీలకు బోలెడంత టైమ్ దొరికింది. ఎప్పటి నుండో చేయాలనుకుని వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడం, నచ్చిన పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నారు. తాజాగా చాలా మంది సినీ ప్రముఖుల్లాగే మంచు విష్ణు కూడా టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. వెరైటీగా రూపొందించిన ఓ వీడియో పోస్ట్ చేశాడు.
మల్టిపుల్ క్యారెక్టర్లతో ఎంట్రీ అదరగొట్టిన విష్ణు ‘హలో టిక్‌టాక్! నేను వచ్చేశా. లెట్స్ హేవ్ ఫన్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విష్ణు హీరోగా ‘మోసగాళ్లు’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Hello, Tik Tok! I’m here, let’s have some fun!! @TikTok_IN https://t.co/lkdH4fFgNB
— Vishnu Manchu (@iVishnuManchu) May 6, 2020
Also Read | ‘బంగారం’ హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించిన దుండగులు..