Mohan Babu : నా ఆస్తిపై ఎవరికీ అధికారం లేదు.. మనోజ్ తిరిగివ్వాల్సిందే.. మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు…

సోమవారం నాడు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Mohan Babu Sensational Comments on Her Properties and Manoj

Mohan Babu : గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకు జఠిలం అవుతున్న సంగతి తెలిసిందే. ఆస్తి తగాదాలు అని అంటున్నా మనోజ్ మాత్రం కాలేజీ గొడవలు అని గతంలో చెప్పారు. మనోజ్ ని అసలు ఇంట్లోకి కానీ మంచు ఫ్యామిలీ పరిసరాల్లోకి కానీ రానివ్వట్లేదు మంచు కుటుంబం. ప్రస్తుతం మంచు మనోజ్ జల్ పల్లి లో ఉంటున్న ఇల్లు తనదే అని, ఆ ఇల్లు ఖాళి చేసి ఇచ్చేయాలని ఇటీవల మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టరేట్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ఇప్పటికే మనోజ్ కి నోటీసులు పంపించి విచారించారు. అయితే మోహన్ బాబు తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ డిసెంబర్ 17న రంగారెడ్డి కలెక్టర్ కి ఫిర్యాదు చేసారు. దీనిపై సోమవారం నాడు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదట వీరితో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరినీ ఒకేచోట కూర్చోబెట్టి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా K ర్యాంప్ ఓపెనింగ్.. ఫోటోలు..

ఈ క్రమంలో మోహన్ బాబు.. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో ఉన్న నా ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించాడని, ఆస్తులు కావాలని డిమాండ్ చేస్తున్నాడని, నా ఆస్తులన్నీ స్వార్జితమని, వాటిపై ఎవరికీ హక్కు లేదని, మనోజ్ వద్ద ఉన్న ఆస్తులను తనకు అప్పగించాల్సిందేనని, నా ఆస్తులపై మనోజ్ కి ఎలాంటి హక్కు లేదని మోహన్ బాబు చెప్పారు. అలాగే జల్ పల్లిలోని ఇండ్లు, ఫిల్మ్ నగర్లోని ఇంటి వివరాలను కలెక్టర్ కి వెల్లడించారు.

అనంతరం మనోజ్.. ఓ పెద్ద డబ్బాలో తాను తీసుకొచ్చిన డాక్యుమెంట్లను ప్రతిమా సింగ్ కి చూపించారు. మంచు మనోజ్ కూడా తన వాదనను వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరికీ చెప్పారు. విచారణ అనంతరం ముందుగా మనోజ్ కలెక్టరేట్ నుంచి వెళ్లిపోగా, తర్వాత మోహన్ బాబు వెళ్లారు. ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Also Read : Rag Mayur : సినిమా బండితో ఫేమ్ తెచ్చుకొని.. ఇప్పుడు వరుస సినిమాలతో.. విలన్ గా.. హీరోగా..

మరి తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందో, ఈ ఆస్తుల గొడవ ఎప్పటికి తెలుస్తుందో, అసలు గొడవ ఆస్తుల గురించేనా, ఇంకేమైనా ఉందా, మొన్నటిదాకా మాట్లాడిన మంచు విష్ణు ఎందుకు సైలెంట్ అయ్యాడు వీటన్నిటికీ సమాధానాలు తెలియాల్సి ఉంది.