Mohan Babu Prakash Raj Vishnu
MAA Election : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిలింనగర్ లోని జూబ్లి పబ్లిక్ స్కూల్ లో ఈ ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అభిమానుల ఆరాధ్యులైన అతిరథ మహారథులు, అగ్రహీరోలు, యంగ్ హీరోలు, స్టార్లు, అందరూ పోలింగ్ లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో.. పోలింగ్ స్టేషన్ మొత్తం సందడిగా మారింది.
MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ కాలిగోటికి కోట సరిపోరు..! నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
పోలింగ్ కంటే ముందు… ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. రెండు ప్యానెళ్ల ముఖ్యులు ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. మోహన్ బాబును ప్రకాశ్ రాజ్ పలకరించారు. ప్రకాశ్ రాజ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు మోహన్ బాబు. ఈ సమయంలో.. మోహన్ బాబు కాళ్లు మొక్కేందుకు ప్రకాశ్ రాజ్ ప్రయత్నించారు. ఐతే.. మోహన్ బాబు వద్దని వారించారు. ఆ తర్వాత… ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇద్దరి చేతులనూ కలిపారు మోహన్ బాబు. ఆ తర్వాత… ప్రకాశ్ రాజ్, విష్ణు ఇద్దరూ ఆప్యాయంగా హగ్ ఇచ్చుకున్నారు. పలకరించుకున్నారు. ఈ సీన్.. అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది.
Manchu Vishnu: మేమే గెలుస్తున్నాం.. డిన్నర్ మీట్‌కి 500మంది వచ్చారు -మంచు విష్ణు
ఫ్రెండ్లీ వాతావరణంలో మా పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలు ఫ్రెండ్లీగానే ఉంటాయి కానీ… ఓటు మాత్రం సీరియస్ గా ఉంటుందని మా మాజీ అధ్యక్షుడు నరేష్ చెప్పడం విశేషం.