Rich Movie : ‘రిచ్’ సినిమా ఓపెనింగ్.. బస్తీ బాయ్ లవ్ స్టోరీ..
మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా రిచ్. (Rich Movie)
- Saketh U
- Published on- September 28, 2026 / 06:48 PM IST
Rich Movie
Rich Movie : మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా రిచ్. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. బేబీ ఆరాధ్య&ఆదర్శ్ సమర్పణలో ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ నిర్మాణంలో రాజా నరేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు గోపీ మోహన్, దశరథ్, V సముద్ర, G రామ్ ప్రసాద్, డిఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్.. పలువురు అతిథులుగా హాజరయ్యారు.
పూజా కార్యక్రమం అనంతరం నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. రాజా నరేంద్ర రిచ్ కథను చాలా రిచ్‌గా చెప్పారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగానే ఈ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. హీరో మోహిత్ పెడాడా మాట్లాడుతూ.. మా రిచ్ లాంటి మంచి కథకు మంచి నిర్మాతలు దొరికారు. ఇంటర్వెల్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్‌కి గూస్ బంప్స్ వస్తుంది. యాక్టింగ్ చేస్తూ రాజా గారు కథను అద్భుతంగా నెరేట్ చేశారు. ఈ సినిమా తర్వాత మేమంతా కూడా రిచ్ అవుతాం అని అన్నారు. నిర్మాత మార్గం గోపి మాట్లాడుతూ.. మా రిచ్ సినిమాని ఈ రోజు ప్రారంభించాం. పద్మనాభ రెడ్డి గారితో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాం అని అన్నారు.
Also Read : Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన OG సింగర్ రాజకుమారి.. లేడీ డైరెక్టర్ సినిమాకు..
దర్శకుడు రాజా నరేంద్ర మాట్లాడుతూ.. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుత తరానికి నచ్చేలా బస్తీ బాయ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం అని తెలిపారు.
