Monal
Nayanathara : లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో సినిమాలని నిర్మిస్తున్నారు. మంచి మంచి కథలతో యువ దర్శకులకి అవకాశాలిస్తూ మంచి సినిమాలని నిర్మించి విజయాలు సాధిస్తున్నారు వీరిద్దరూ. ఇప్పటివరకు తమిళ్ లో సినిమాలను నిర్మించిన వీరు తాజాగా గుజరాతి భాషలోకి కూడా అడుగు పెట్టారు.
తమిళంలో విజయం సాధించిన ‘ఆండవన్ కట్టలై’ సినిమాని గుజరాతీ భాషలో రీమేక్ చేస్తున్నారు. దీనికి గుజరాతీలో ‘శుభయాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, రితిక సింగ్ హీరోయిన్‌గా తెరకెక్కించారు. గుజరాతీలో అక్కడి స్టార్ హీరో మల్హర్ టక్కర్ హీరోగా ఈ సినిమాని మొదలు పెట్టారు. ఇందులో హీరోయిన్‌గా గుజరాతి భామ, తెలుగు హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ మొనాల్ గజ్జర్‌ని తీసుకున్నారు.
Aadavallu Meeku Joharlu : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ సినిమాకి ప్రముఖ గుజరాతీ దర్శకుడు మనీష్ సైనీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలని విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా తర్వాత కూడా గుజరాతీ భాషలోనూ వరుసగా సినిమాలని నిర్మిస్తామని విగ్నేష్ తెలిపారు.