Berlin : నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ ‘మనీహైస్ట్’ నుంచి బెర్లిన్ వచ్చేస్తున్నాడు.. టీజర్ రిలీజ్..

ఇండియాలో మనీహైస్ట్ సిరీస్ కి ఎంత డిమాండ్ వచ్చింది అంటే ఏకంగా నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ ఇండియాలో లోకల్ లాంగ్వేజెస్ లో లాస్ట్ సీజన్ ని రిలీజ్ చేయడమే కాక, ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు.

Money Heist famous character Berlin Series promo released from Netflix

Netflix :  నెట్‌ఫ్లిక్స్ లో 2017లో మొదలైన మనీహైస్ట్(Money Heist) సిరీస్ 2021 వరకు మూడు సీజన్స్ తో 40 ఎపిసోడ్స్ గా సాగింది. ఈ సిరీస్ తో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా బ్యాంకులను దోచుకునే కాన్సెప్ట్ తో మనీహైస్ట్ ని తెరకెక్కించారు. ప్రతి ఎపిసోడ్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఇక ఇండియాలో అయితే ఈ సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ కూడా పెరిగింది.

ఇండియాలో మనీహైస్ట్ సిరీస్ కి ఎంత డిమాండ్ వచ్చింది అంటే ఏకంగా నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ ఇండియాలో లోకల్ లాంగ్వేజెస్ లో లాస్ట్ సీజన్ ని రిలీజ్ చేయడమే కాక, ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేశారు. అయితే ఈ సిరీస్ ఇంత సక్సెస్ అయ్యాక కూడా దీనికి సీక్వెల్ ప్రకటించలేదు. కానీ ఈ సిరీస్ లో ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో బ్యాకెండ్ స్టోరీ ఉంటుంది. వాటిపై సిరీస్ లు వచ్చే అవకాశం ఉందని గతంలో ప్రకటించారు.

ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ ప్రొఫెసర్ కి బ్రదర్, మనీహైస్ట్ టీంకి సెకండ్ కమాండర్ బెర్లిన్. ఈ క్యారెక్టర్ ని పెడ్రో అలోన్సో చేశారు. అన్ని క్యారెక్టర్స్ తో పాటే ఈ క్యారెక్టర్ కూడా బాగా హిట్ అయింది. ఈ క్యారెక్టర్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఆల్రెడీ కొంచెం మనీహైస్ట్ లో చూపించారు. ఇప్పుడు బెర్లిన్ క్యారెక్టర్ తో సపరేట్ సిరీస్ రాబోతుంది. తాజాగా బెర్లిన్ సిరీస్ నుంచి ప్రోమో రిలీజ్ చేశారు. మనీ హైస్ట్ లో బెర్లిన్ వజ్రాభరణాలు కొట్టేయడంతో స్పెషలిస్ట్ అని చూపించారు. ఇప్పుడు బెర్లిన్ సిరీస్ లో అదే చూపించబోతున్నారు. టీజర్ లో చూపించిన దాని ప్రకారం పారిస్ లో ఉన్న అతిపెద్ద వేలం వేసే సంస్థలో ఉండే ఆభరణాలు బెర్లిన్ కొట్టేయబోతున్నట్టు చూపించారు.

Squid Game 2 : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ గేమ్ సిరీస్ స్క్విడ్ గేమ్.. సీజన్ 2 త్వరలో.. గ్లింప్స్ రిలీజ్..

దీంతో మనీహైస్ట్ అభిమానులు బెర్లిన్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి మరి. ఇక నెట్‌ఫ్లిక్స్ బెర్లిన్ సిరీస్ ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మరోసారి నెట్‌ఫ్లిక్స్ కి భారీ ఆదరణ రానుంది బెర్లిన్ సిరీస్ తో.