Berlin Web Series Review : బెర్లిన్‌ వెబ్ సిరీస్ రివ్యూ.. ‘మనీ హైస్ట్‌’ అంత మెప్పించిందా..?

బెర్లిన్‌ వెబ్ సిరీస్ 'మనీ హైస్ట్‌' అంత మెప్పించిందా..? బెర్లిన్, ప్రొఫిసర్ కంటే ఎక్కువుగా థ్రిల్ చేశాడా..? అనే విషయాలు ఈ రివ్యూ చదివి తెలుసుకోండి.

Berlin Web Series Review : బెర్లిన్‌ వెబ్ సిరీస్ రివ్యూ.. ‘మనీ హైస్ట్‌’ అంత మెప్పించిందా..?

Money Heist prequel Berlin Web Series Review in telugu

Updated On : January 6, 2024 / 3:57 PM IST

Berlin Web Series Review : ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ నుంచి 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చిన హైస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మనీహైస్ట్’. మూడు సీజన్స్ 40 ఎపిసోడ్స్ తో సాగిన ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. హైస్ట్ కథాంశంలోనే ది బెస్ట్ గా నిలిచింది. కాగా ఆ సిరీస్ లో ప్రొఫిసర్ పాత్రకి ఎంత క్రేజ్ వచ్చిందో, బెర్లిన్ అనే పాత్రకు కూడా అంతే క్రేజ్ క్రియేట్ అయ్యింది.

దీంతో ఆ పాత్రతో ‘బెర్లిన్’ అనే కొత్త సిరీస్ ని నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. తాజాగా ఈ సిరీస్ మొదటి సీజన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సిరీస్ ‘మనీ హైస్ట్‌’ అంత మెప్పించిందా..? బెర్లిన్, ప్రొఫిసర్ కంటే ఎక్కువుగా థ్రిల్ చేశాడా..? అనే విషయాలు ఈ రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ విషయానికొస్తే..
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 44 మిలియన్‌ యూరోల విలువు గల వజ్రాల హారాలు పారిస్‌‌లో ఆక్షన్‌‌కి వస్తాయి. ఆ ఆభరణాలన్నిటిని భారీ భద్రత గల ఓ ఆక్షన్‌‌ హౌస్ లో భద్రపరుస్తారు. ఇక వాటిని దొంగలించడానికే బెర్లిన్ అండ్ టీం ఒక వ్యూహం రచిస్తుంది. ఈ టీంలో దామియన్‌, రాయ్‌, బ్రూస్‌, కైలా, కామెరూన్‌‌లు ఉంటారు. ఇక ఈ సిరీస్ లో మరో ముఖ్య పాత్ర కమిలి. ఈమె ఆ ఆక్షన్‌‌ హౌస్ ఓనర్ భార్య.

ఈ దోపిడీ కోసం ఆక్షన్‌‌ హౌస్ ఓనర్ ఇంటి పై నిఘాపెట్టిన బెర్లిన్ కమిలితో ప్రేమలో పడతాడు. ఇక ఒక పక్క ఆమెతో ప్రేమాయణం నడుపుతూనే దోపిడీ ఎలా చేశాడు..? ఈ మధ్యలో వారికీ ఎదురైనా ఇబ్బందులు ఏంటి..? దానికి బెర్లిన్ అండ్ టీం రచించిన ప్రణాళిక ఏంటి..? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

వెబ్ సిరీస్ విశ్లేషణ..
‘మనీ హైస్ట్‌’ అంతా దోపిడీ నేపథ్యంతో సాగుతూ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కానీ బెర్లిన్ దోపిడీ కంటే ప్రేమ కథలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా దొంగ పోలీస్ డ్రామా అసలు కనిపించదు. ఇక ఆడియన్స్ ఎంతో ఆశించిన బెర్లిన్ పాత్ర.. దోపిడీని పక్కన పెట్టి కమిలితో ప్రేమ నడపడం అందరికి కొంచెం నిరాశ కలిగిస్తుంది. మనీ హైస్ట్‌ లో ప్రొఫిసర్ పాత్ర ముందుండి కథని నడిపిస్తుంటాడు. కానీ ఈ సిరీస్ లో బెర్లిన్ ప్రేమ పాటలు చెబుతుంటే దామియన్‌ పాత్ర కథని నడిపిస్తుంటుంది.

ఇక మిగిలిన పాత్రలు రాయ్‌-కామెరూన్‌‌, బ్రూస్‌-కైలా మధ్య సీన్స్, దామియన్‌ తన వైఫ్ తో విడాకులు సీన్స్.. కూడా ప్రేమ కథ చుట్టూనే జరుగుతుంది. సిరీస్ మొత్తంలో నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే దోపిడీ భాగం ఉంటుంది. ఆ తరువాత అంతా ప్రేమ, ఎమోషన్స్, ఆ హారాలతో పారిస్ నుంచి బయటపడడం అనేది చాలా సాదాసీదాగా సాగుతుంది. ఈ చివరి నాలుగు ఎపిసోడ్స్ లో కొన్ని సీన్స్ అయితే మన తెలుగు సినిమాల్లో కూడా చూసినట్లు ఉంటాయి. ఈ 8 ఎపిసోడ్స్ సిరీస్ తో ఈ దోపిడీని సింపుల్ గా ముగించేశారు. అలాగే కొన్ని పాత్రలకు కూడా ఎండింగ్ ఇవ్వకుండా వదిలేసినట్లు అనిపిస్తుంది.

నటీనటులు..
మనీహైస్ట్ లో సీరియస్‌గా ఒక సైకో పాత్‌గా కనిపించిన బెర్లిన్ (Pedro Alonso).. ఈ సిరీస్ దాని విరుద్ధంగా లవర్ బాయ్‌గా, ప్రేమ కోసం ఆరాటపడే రోమియోగా బాగా నటించినప్పటికీ ఆడియన్స్ ని ఈ పాత్ర నిరాశపరిచింది. దామియన్‌ (Tristán Ulloa), రాయ్‌ (Julio Peña Fernández) పాత్రలు చేసిన ఇద్దరు.. తమ నటనతో కథని ముందుకు తీసుకు వెళ్తూ ఆడియన్స్ ని బెర్లిన్ కంటే ఎక్కువ ఆకట్టుకున్నారు అనే చెప్పాలి.

కైలా (Michelle Jenner) ఒక ఇంట్రోవర్ట్‌గా, తెలివిగల అమ్మాయిగా నటించిన తీరు విజుల్స్ వేయిస్తుంది. ఇక లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ కనిపించే కామెరూన్‌‌ (Begoña Vargas) తన నటనతో ప్రతి లవ్ ఫెయిల్యూర్ పర్సన్ ని రిఫ్లెక్ట్ చేసింది. బ్రూస్‌ (Joel Sánchez) పాత్ర రోమియోగా సరదాగా సాగిపోతుంది. కమిలి (Samantha Siqueiros) పాత్ర పోషించిన అమ్మాయి.. భర్త నుంచి ప్రేమ నోచుకోలేని భార్యగా కనిపించి ఆకట్టుకుంది. అలాగే మనీహైస్ట్ లో కనిపించిన లేడీ పోలీస్ పాత్రలు రాకెల్ (Itziar Ituño), అలిసా (Najwa Nimri).. ఈ సిరీస్ లో కనిపించిన పెద్ద ప్రాధాన్యత కనిపించదు.

ఫ్యామిలీతో చూడొచ్చా..? ఎలా ఉంది..?
న్యూడిటీ లేకున్నా ఘాటు లిప్ కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. మొత్తం మీద మొదటి నాలుగు ఎపిసోడ్స్ దోపిడీతో ఆసక్తిగా సాగితే, తరువాతి నాలుగు ఎపిసోడ్స్ ల్యాగ్ అనిపిస్తుంది.

గమనిక : ఈ రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.