ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్న సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తన కొత్త సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత వీళ్ల కాంబోలో రాబోయే ఈ సినిమాను.. రామ్ హోమ్ బ్యానర్ ‘స్రవంతి మూవీస్’లో, అన్నయ్య కృష్ణ పోతినేని సమర్పణలో, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు.
రామ్ 18వ సినిమా ఇది.. ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గుబురు గెడ్డంతో రామ్ రగ్డ్ లుక్ ఆకట్టుకుంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన రామ్.. ‘రెడ్’ కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు..
కిషోర్, రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశాడని ఫిలింనగర్ సమాచారం.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. సంగీతం : ’మెలోడిబ్రహ్మ’ మణిశర్మ, కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : జునైద్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.
?!! #RED !!?
This one is going to be…So-Bloody-Different! ?#REDTheFilm #RAPO18 #RAPO18FIRSTLOOK pic.twitter.com/4jXhicUyrK
— RAm POthineni (@ramsayz) October 28, 2019