దళపతి, మక్కల్ సెల్వన్ ‘మాస్టర్’ మూడో పోస్టర్

దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న‘మాస్టర్’ థర్డ్ లుక్ రిలజ్..

  • Published By: sekhar ,Published On : January 27, 2020 / 06:05 AM IST
దళపతి, మక్కల్ సెల్వన్ ‘మాస్టర్’ మూడో పోస్టర్

Updated On : January 27, 2020 / 6:05 AM IST

దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న‘మాస్టర్’ థర్డ్ లుక్ రిలజ్..

దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘మాస్టర్’.. ‘మా నగరం’, ‘ఖైదీ’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా కాగా ఆండ్రియా, శాంతను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Image

ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మూడో లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఓ వైపు దళపతి, మరోవైపు సేతుపతి ముఖాలపై గాయాలతో కనిపించారు. ఇద్దరూ ఎదురెదురుగా ఒకరిని చూసి మరొకరు అరుస్తూ ఉన్నారు. ఇద్దరూ షర్ట్ లెస్‌గా ఉండడంతో విజయ్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తాడేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Also : ‘‘వి’’ నుండి రక్షకుడు వచ్చేశాడు!

Image

విజయ్ సేతుపతి ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలతోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు విజయ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మ్యూజిక్ : అనిరుధ్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్.