యూత్‌ఫుల్‌ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న యూత్‌ఫుల్‌ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ సోమవారం రిలీజ్ చేశారు. గోపి సుందర్ ట్యూన్‌కి సురేంద్ర కృష్ణ లిరిక్స్ రాయగా, లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు. (కొరటాలతో సినిమా టైటిల్ చెప్పేసిన చిరంజీవి.. ఆ తర్వాత సారీ కూడా చెప్పారు)
‘మనసా మనసా.. మనసారా బ్రతిమాలా.. తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా.. అయినా నువ్వినకుండా తనవైపు వెళతావా మనసా.. నా మాట అలుసా.. నేనెవరో తెలుసా.. నాతోనే వుంటావు, నన్నే నడిపిస్తావు.. నన్నాడిపిస్తావె మనసా’.. అంటే సాగే ఈ ఫీల్‌గుడ్ మెలోడి ఆకట్టుకుంటోంది.
ఇటీవల అఖిల్, పూజా హెగ్డేలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగణంతో పాటు అఖిల్, పూజా హెగ్డే ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేశ్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా, నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ, సమర్పణ : అల్లు అరవింద్, బ్యానర్ : జీఏ2 పిక్చర్స్.