కెరీర్ సూపర్.. మరి మ్యారీడ్ లైఫ్?

  • Published By: sekhar ,Published On : October 19, 2020 / 05:55 PM IST
కెరీర్ సూపర్.. మరి మ్యారీడ్ లైఫ్?

Updated On : October 19, 2020 / 6:02 PM IST

Most Eligible Bachelor: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు.


‘‘హాయ్‌.. ఐయామ్‌ హర్ష.. ఒకబ్బాయి కెరీర్‌లో ఫిఫ్టీ పర్సెంట్‌ కెరీర్‌, ఫిప్టీ పర్సెంట్‌ మ్యారీడ్‌ లైఫ్‌ ఉంటుంది. కెరీర్‌ను సూపర్‌గా సెట్‌ చేశాను. ఈ మ్యారీడ్‌ లైఫే..ఓ.. అయ్యయ్యయ్యో’’ అంటూ ఒంటి కాలిపై నిలబడుతూ.. అఖిల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.


దసరా కానుకగా అక్టోబర్‌ 25 ఉదయం 11 గంటల 40 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపిసుందర్ సంగీతమందిస్తున్నారు.