ఇంటర్ చదువుతున్న కుమార్తె, కొడుకుతో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. రైలు కింద పడి..
మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పి.విజయ (38), ఆమె కూతురు పి.చేతన (18), కుమారుడు విశాల్(16)గా పోలీసులు గుర్తించారు.
Chethana, Vishal, Vijaya (Image Credit To Original Source)
- చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన
- ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో మూడు మృతదేహాలు లభ్యం
- మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీ వాసులు
Ghatkesar: తెలంగాణలోని చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి పి.విజయ (38), ఆమె కూతురు పి.చేతన (18), కుమారుడు విశాల్(16)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు విజయ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేసేవారు. చేతన రెడ్డి(18), కొడుకు విశాల్ రెడ్డి(16) చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు.
ఈ రోజు తెల్లవారు జామున వారు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. విజయ భర్త సౌదీలో ఉన్నట్లు ఆమె తల్లి చెప్పారు. పిల్లలు కూడా చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేరుకుని సికింద్రాబాద్ జీ ఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
