సెట్‌లో అగ్నిప్రమాదం.. అప్‌సెట్ అయిన హీరో..

  • Publish Date - August 15, 2020 / 05:11 PM IST

మిషన్ ఇంపాజిబుల్-7 షూటింగ్ సెట్‌లో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 2.6 మిలియన్ డాలర్ల (రూ.20కోట్లు)నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని చిత్ర బృందం తెలిపింది.



వివరాల్లోకి వెళితే.. బైక్ స్టంట్‌ సీన్‌ను చిత్రించేందుకు అందరూ సిద్ధమయ్యారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ స్టంట్‌ ప్రదర్శించేటప్పుడు ఒక్కసారిగా బైక్‌కు నిప్పంటుకుంది. దీంతో సెట్‌లో మంటలు చెలరేగాయి. అయితే స్టంట్ మ్యాన్ సురక్షితంగా బయటపడగా, సెట్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.



విషయం తెలిసి చిత్ర కథానాయకుడు టామ్ క్రూజ్ అసహనానికి గురయ్యాడు. కరోనా వల్ల షూటింగ్ ఇప్పటికే ఆలస్యం కావడం, ఇంతలోనే ఈ ప్రమాదం జరగడమే టామ్ అసహనానికి కారణమని చిత్ర బృందం తెలిపింది.