ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న బాలీవుడ్ హీరోయిన్

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 05:27 AM IST
ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న బాలీవుడ్ హీరోయిన్

Updated On : September 19, 2019 / 5:27 AM IST

బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ బుదవారం (సెప్టెంబర్ 18, 2019)న పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ముంబాయిలోని మెట్రో రైల్ పనులు జరుగుతున్న దగ్గర ఆమె కారు ఆగింది. 11వ అంత‌స్తు నుండి పెద్ద బండ‌రాయి వ‌చ్చి మౌని రాయ్ కారుపై ప‌డింది. కాని ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి హాని జ‌ర‌గ‌లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై మౌనీ రాయ్ ట్విట్ చేస్తూ.. నేను జూహు సిగ్నల్ నుంచి వెళ్తున్న సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో నా కారును అక్కడ ఆపాను. ఉన్నట్టుండి 11 అంతస్తుల పై నుంచి ఓ పెద్ద బండరాయి వ‌చ్చి నా కారుపై పడింది. దీంతో కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ఒకవేళ నా కారుపైన కాకుండా..బైక్ పై గానీ వేరే వాహనాల పై గానీ పడుంటే ఏంటి పరిస్థితి ? ముంబై మెట్రో పనులు ఎంత బాగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అని త‌న ట్వీట్‌ ద్వారా మండిపడింది.