Movie on Galwan : ఇండియా-చైనా గాల్వాన్ ఇష్యూపై సినిమా.. తెరకెక్కించనున్న బాలీవుడ్ డైరెక్టర్

గాల్వన్ ఇష్యూ పై సినిమా రాబోతుంది. ఇప్పటికే గాల్వాన్ సమస్యపై పలు పుస్తకాలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ లు శివ్ అరోరా, రాహుల్ సింగ్ లు 2020లో జరిగినా గాల్వాన్ సమస్య పై రాసిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Movie on Galwan issue by bollywood director Apoorva lakhia

Movie on Galwan :  ఇండియా(India) బోర్డర్స్ దగ్గర పాకిస్తాన్, చైనా(China) వైపు అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. సరిహద్దు దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటాయి. లడఖ్(Ladakh) లో చైనా బోర్డర్ కు దగ్గర్లో ఉన్న గాల్వాన్(Galwan) లోయలో చైనా అప్పుడపుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంటుంది. కానీ మన ఇండియన్ ఆర్మీ(Army) ఎప్పటికప్పుడు చైనా వాళ్లకు గట్టి సమాధానం చెప్తూనే ఉన్నారు. 2020 లో జరిగిన గాల్వాన్ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఆ గాల్వన్ ఇష్యూ పై సినిమా రాబోతుంది. ఇప్పటికే గాల్వాన్ సమస్యపై పలు పుస్తకాలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ లు శివ్ అరోరా, రాహుల్ సింగ్ లు 2020లో జరిగినా గాల్వాన్ సమస్య పై రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3’ అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘షూట్ అవుట్ యెట్ట లోఖండ్ వాలా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

Shahrukh Khan : కాశ్మీర్ లో షారుఖ్ ఖాన్ డంకీ.. వీడియో వైరల్!

ఈ సినిమాలో 2020 గాల్వన్ లో పరిస్థితులు, సమస్యలు, మన ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వం చైనాను ఎలా ఎదుర్కొంది, ఆర్మీ చూపించిన ధైర్య సాహసాలు చూపెట్టబోతున్నారు. ఇటీవలే ఆర్మీ నుంచి పర్మిషన్ కూడా తీసుకొని డైరెక్టర్ అపూర్వ లఖియా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమా షూట్ కు వెళ్లనుంది.