Movie Releases in Telugu : ఈ దసరాకి థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలివే..

ఈ దసరాకి థియేటర్, ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటన్నిటి వైపు ఒక లుక్ వేసేయండి.

Movie Releases in Telugu for this dasara festival

Movie Releases in Telugu : ఈ దసరా ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ పంచబోతుంది. స్టార్ హీరోల నుంచి క్రేజీ కాంబినేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు సినిమాలు రాబోతున్నాయి. ఈసారి పండగ అంతా థియేటర్ లోనే కనిపించబోతుంది. అలాగే ఓటీటీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటన్నిటి వైపు ఒక లుక్ వేసేయండి.

Also read : Mahesh babu : ఫస్ట్ టైం మా ఆవిడతో ఇలా రావడం.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..

బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీ ‘భగవంత్‌ కేసరి’. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస సక్సెస్ ల్లో ఉన్న బాలయ్య నుంచి వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబరు 19న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

లోకేష్‌ కనగరాజ్‌, విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లియో’. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాల తరువాత లోకేష్ నుంచి వస్తున్న మూవీ కావడం, గతంలో విజయ్ తో మాస్టర్ వంటి సక్సెస్ అందుకోవడంతో ఈ మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అక్టోబరు 19న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

రవితేజ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కొత్త డైరెక్టర్ వంశీ డైరెక్ట్ చేసిన మూవీ.. పాన్ ఇండియా వైడ్ అక్టోబరు 20న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

బాలీవుడ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గణపథ్‌’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కృతిసనన్‌ నటిస్తున్నారు. మొదటి భాగం ‘ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’ ట్యాగ్ లైన్ తో అక్టోబరు 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

అలాగే డైరెక్ట్ ఓటీటీలో ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మెయిన్ లీడ్ లో ఓంకార్‌ డైరెక్ట్ చేసిన సినిమా ‘మాన్షన్‌ 24’. హారర్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ.. అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌ లో ప్రసారం కానుంది.

ఇక ఓటీటీ చిత్రాలు విషయానికి వస్తే..

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే S3 E1 – అక్టోబరు 19 (Aha Video)
మామా మశ్చీంద్ర – అక్టోబరు 20 (Aha Video)

కృష్ణారామా – అక్టోబర్ 22 (ETV Win)