‘అరె అరె మామా.. ఈ ప్రేమంతా ఓ డ్రామా’ – ట్రైలర్ మామూలుగా లేదుగా!

క్రౌడ్ ఫండెడ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - February 29, 2020 / 10:43 AM IST

క్రౌడ్ ఫండెడ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

పూర్తిగా కొత్తవారితో క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ‘మిస్టర్ అండ్ మిస్’.. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించగా 2019 సైమా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గెలుచుకున్న అశోక్‌ రెడ్డి దర్శకత్వంలో రీడింగ్‌ ల్యాంప్‌ క్రియేషన్స్‌  నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రిలీజ్ చేశారు. లవ్, రొమాన్స్, డైలాగ్స్ బ్రేకప్.. కీలకంగా మారిన మొబైల్ మిస్సింగ్.. ఇలా యూత్‌ రిలేటెడ్ కంటెంట్‌తో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.

హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. మార్చిలో విడుదల కానున్న ఈ చిత్రానికి యశ్వంత్‌ నాగ్‌ సంగీతమందిస్తున్నాడు. లిరిక్స్ : పవన్ రాచేపల్లి, సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్, ఎడిటింగ్ : కార్తీక్ కట్స్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ.