Mrunal Thakur : సీతా.. నిన్ను ఇలా చూడలేము.. మృణాల్ బికినీ ఫోటోలపై అభిమానుల కామెంట్స్..

ఇటీవల మృణాల్ మాల్దీవ్స్ కి వెళ్లడంతో అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ బికినిలో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్. ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఇవి వైరల్ గా మారాయి.

Mrunal Thakur Bikini Photos goes viral(Photo : Instagram)

Mrunal Thakur :  మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్(Bollywood) లో పలు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈమెకు తెలుగులో చేసిన ఒక్క సీతారామం(Sita Ramam) సినిమాతో వచ్చేసింది. సీతారామం సినిమాలో సీత పాత్రలో, చీరకట్టులో పక్కా తెలుగమ్మాయిలా మెప్పించింది మృణాల్ ఠాకూర్. తెలుగు(Telugu) ప్రేక్షకులని కాక దేశమంతటా తన సీత పాత్రతో మెప్పించి అభిమానులని సొంతం చేసుకుంది. సీత పాత్రలో ఇమిడిపోయి ఆ సినిమా ఎఫెక్ట్ తో ప్రేక్షకులు మృణాల్ ఠాకూర్ అంటే సీత మాత్రమే అనుకునేలా చేసింది.

మృణాల్ ఆ సినిమా అయిపోయి బయటకు వచ్చి వేరే సినిమాలు చేస్తున్నా ప్రేక్షకులు, ఆమె అభిమానులు మాత్రం ఇంకా సీతని మర్చిపోలేకపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే కొన్ని మోడ్రన్ డ్రెస్ లలో మృణాల్ కనిపించడంతో మా సీత ఏంటి ఇలా మారిపోయింది, నువ్వు కూడా అందరి హీరోయిన్స్ లాగా చెయ్యకు, నువ్వు సీత గానే బాగుంటావు అని కామెంట్స్ చేశారు అభిమానులు, నెటిజన్లు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఏకంగా బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది.

ఇటీవల మృణాల్ మాల్దీవ్స్ కి వెళ్లడంతో అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ బికినిలో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్. ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఇవి వైరల్ గా మారాయి. మృణాల్ ఠాకూర్ ని ఇలా బికినిలో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది బికినిలో కూడా మృణాల్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటే చాలా మంది మాత్రం.. సీతా ఇలా మారిపోయావేంటి, నిన్ను బికినిలో చూడలేము, నువ్వు చీరలోనే బాగుంటావు, మీకేమైంది?, ఇది మా సీత కాదు, ఒక్క నిన్ను మాత్రం బికినిలో చూడకూడదు అనుకున్నాం కానీ నువ్వు దాన్ని బ్రేక్ చేశావు, నిన్ను ఇలా చూడలేకపోతున్నాము.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Ram Charan : బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చరణ్.. ఎందులోనో తెలుసా?

దీంతో మృణాల్ బికినీ ఫోటోలు మరింత వైరల్ గా మారాయి. అభిమానులు, ప్రేక్షకులు ఇంకా సీత పాత్ర నుంచి బయటకి వచ్చి మృణాల్ ని చూడలేకపోతున్నారు, అందుకే ఇలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కి కొంతమంది మాత్రం సీత ఫిక్షనల్ క్యారెక్టర్, మృణాల్ రియల్ లైఫ్, ఇది తన ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.