Ram Charan : బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చరణ్.. ఎందులోనో తెలుసా?

ప్రముఖ సినీ వెబ్ సైట్ IMDB ప్రతి వారం, ప్రతి నెల ఇండియాలో టాప్ స్టార్స్ లిస్ట్ ఇస్తుంది. ఫ్యాన్స్ ఓటింగ్, వాళ్ళ పాపులారిటీ, వాళ్ళ యాక్టివిటీలను బట్టి IMDB ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది.

Ram Charan : బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చరణ్.. ఎందులోనో తెలుసా?

Ram Charan (Photo : Instagram)

Ram Charan :  RRR తర్వాత రామ్ చరణ్(Ram Charan)), ఎన్టీఆర్(NTR), రాజమౌళి(Rajamouli)లకు దేశ విదేశాల్లో బాగా పేరొచ్చిన సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో నార్త్ లో మరింత ఫేమస్ అయ్యారు. బాలీవుడ్(Bollywood) స్టార్స్ కంటే కూడా చరణ్, ఎన్టీఆర్ కు ఎక్కువ గుర్తింపు వస్తుంది. నార్త్ లో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. చరణ్, ఎన్టీఆర్ తో బాలీవుడ్ వాళ్ళు సినిమా తీయాలని, బాలీవుడ్ సినిమాల్లో వీళ్ళని పెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నారు.

ప్రముఖ సినీ వెబ్ సైట్ IMDB ప్రతి వారం, ప్రతి నెల ఇండియాలో టాప్ స్టార్స్ లిస్ట్ ఇస్తుంది. ఫ్యాన్స్ ఓటింగ్, వాళ్ళ పాపులారిటీ, వాళ్ళ యాక్టివిటీలను బట్టి IMDB ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. టాప్ 10 మంది లిస్ట్ ఇస్తుంది IMDB. గత కొన్నాళ్లుగా చరణ్, ఎన్టీఆర్ ఈ టాప్ 10 లిస్ట్ లో ఉంటూనే వస్తున్నారు. తాజాగా ఈ వారం రిలీజ్ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ లను దాటి మరీ రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలిచాడు.

Dil Raju : బలగం సినిమాని ఆస్కార్ కి పంపించాలనుకుంటున్నాం.. రాజకీయాల్లోకి రమ్మంటున్నారు

ఈ లిస్ట్ లో రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలవగా బాలీవుడ్ భామ యామి గౌతమ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. షారుఖ్ మూడో ప్లేస్, దీపికా పదుకొనే నాల్గవ స్థానం, సల్మాన్ అయిదవ స్థానం, ఎన్టీఆర్ ఆరవ స్థానం, ఐశ్వర్యరాయ్ ఏడవ స్థానం, రాశిఖన్నా ఎనిమిదవ స్థానం, అమీర్ ఖాన్ తొమ్మిదవ స్థానం, సన్నీ కౌశల్ పదవ స్థానంలో నిలిచారు. మన రామ్ చరణ్ మొదటి ప్లేస్ లో నిలవడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో ఓ సాంగ్ కోసం చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వగా ఈ పాటను విడుదల చేశారు. దీంట్లో చరణ్ సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో కలిసి లుంగీ డ్యాన్స్ అంటూ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు.

View this post on Instagram

A post shared by IMDb India (@imdb_in)