Mrunal Thakur: ధనుష్ లాంటి వ్యక్తిని నేను చూడలేదు.. ఆయన్ని నేను ఒక కోరిక కోరాను.. నాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు
తమిళ స్టార్ ధనుష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).
- V Santhosh Kumar
- Published On : February 20, 2026 / 06:30 AM IST
Mrunal Thakur interesting comments about Dhanush.
Mrunal Thakur: తమిళ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట దర్శనం ఇచ్చాయి. దాంతో, వీరి పెళ్లి వార్తలు నిజమేనని ఫిక్స్ అయ్యారు అంతా.
అయితే, మృణాల్ మృణాల్ మాత్రం ఆ న్యూస్ ను కొట్టిపారేసింది. వారిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పింది. అసలు ఇలాంటి న్యూస్ ఎవరు క్రియేట్ చేస్తారో అర్థం కాదు అంటూ కామెంట్స్ చేసింది. మృణాల్ చేసిన ఈ కామెంట్స్ తో ఈ ఇద్దరి పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. కానీ, తాజాగా మృణాల్ ధనుష్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
Bhagyashri Borse: ప్లాప్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ముచ్చటగా మూడోసారి అదే బ్యానర్ లో
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ధనుష్ గురించి మాట్లాడుతూ.. “ధనుష్ లాంటి నటుడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయన హీరోగా చేసిన అసురన్, రాయన్, రంజానా, కెప్టెన్ మిల్లర్, మారి లాంటి సినిమాలను చూశాను. అప్పటి నుంచి ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. అసురన్ సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. ఆయనలో కేవలం నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, రచయిత, గీత రచయిత, సింగర్ కూడా ఉన్నారు. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉండడం అనేది చాల అరుదు.
రీసెంట్ గా నేను ఆయన నటించిన హిందీ మూవీ తేరే ఇష్క్ మెయిన్ షూటింగ్ కి వెళ్ళాను. అక్కడ ధనుష్ ని కలిసి ఒక కోరిక కోరాను. నా సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్ 2 ‘ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి రావాలని అడిగాను. సడన్ గా వచ్చి ఆయన మాకు సప్రైజ్ ఇచ్చాడు” అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. దీంతో, మృణాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట, హిందీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
