Maa Inti Bangaaram Song: సమంత ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్.. తస్సాదియ్యా వచ్చేసింది
Maa Inti Bangaaram Thassadiya Song: సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) నుంచి తొలి పాట తస్సాదియ్యాను చిత్ర బృందం విడుదల చేసింది.
samantha maa inti bangaaram thassadiya song
- సమంత నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం
- మే 15న విడుదల కానున్న మూవీ
- ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్ర బృందం
- తాజాగా ఫస్ట్ సింగిల్ తస్సాదియ్యా విడుదల
Maa Inti Bangaaram : చాలా కాలం తరువాత సమంత నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్చ్ పతాకం పై నిర్మిస్తోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలక పాత్రలో నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రం (Maa Inti Bangaaram ) మే 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలో ఫస్ట్ పాటను విడుదల చేసింది. తస్సాదియ్యా అంటూ ఈ పాట సాగుతోంది. రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్యసెల్వ ఆలపించారు.
* కొండగట్టు అంజన్న సన్నిధిలో యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్
ఓ బేబీ తరువాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
