Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ తమ్ముడ్ని చూశారా..? నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..!

తమ్ముడితో ఉన్న ఫోటోలను షేర్ చేసిన మృణాల్ ఠాకూర్. బామ్మర్ది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..

Mrunal Thakur shares her brother photos gone viral

Mrunal Thakur : బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఆ మూవీతో ఇక్కడ సూపర్ ఫేమ్ రావడంతో మృణాల్ టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన స్పెషల్ ఫోటోషూట్స్ తో పాటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఉన్న పిక్స్ ని కూడా షేర్ చేస్తుంటుంది. ఈనేపథ్యంలోనే మృణాల్ రీసెంట్ గా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఒక కుర్రాడితో ఉన్న పిక్స్ ని షేర్ చేస్తూ.. “ఐ లవ్ యు. హ్యాపీ 19 మై బేబీ” అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఇది చూసిన మృణాల్ అభిమానులు ఎవరు ఈ బేబీ అంటూ కామెంట్స్ చేస్తుంటే, కొందరు ఫ్యాన్స్.. రిలాక్స్ బాయ్స్ తన అతను మృణాల్ బ్రదర్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ క్లారిటీ ఇలా వచ్చిందో లేదో మృణాల్ అభిమానులు.. “హ్యాపీ బర్త్ డే బామ్మర్ది” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మృణాల్ తమ్ముడిని మీరుకూడా చూసేయండి.

Also read : Rashmika Mandanna : విమానంలో ఆ హీరోతో రష్మిక లిప్ కిస్.. ఫోటో వైరల్..

కాగా మృణాల్ ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో నటిస్తుంది. హాయ్ నాన్న సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈ మూవీని క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే ‘సలార్’ రాకతో ఈ చిత్రం ప్రీ-పోన్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు ఏ విషయం చెప్పలేదు.