హైదరాబాద్ : నటి మధుబాల అంటే అందమే కాదు నటనకు ప్రతిరూపం అనే విషయం గుర్తుకొస్తుంది. ఆమె నటనతో అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్న మధుబాల నటన విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకున్న్ గొప్ప నటి మధుబాల. 1933 ఫిబ్రవరి 14న జన్మించిన మధుబాల 1969 ఫిబ్రవరి 23న కన్నుమూసిన ఆమెకు ప్రముఖ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ మధుబాల జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ డూడుల్‌లో ఆమె ఫోటో ఆవిష్కరించి నివాళులర్పించింది.
మధుబాల సినీ కెరియర్‌లో 70కి పైగా సినిమాలలో నటించిన ఆమె ప్రేక్షకుల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు. 9 ఏళ్ళ వయస్సులో వెండితెరకి పరిచయం అయిన మధుబాల 14 ఏళ్ళ వయస్సులో నీల్ కమల్ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఆమెకు అఖండమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.1949లో వచ్చిన బోంబే టాకీస్ చిత్రం మహల్‌లో ప్రధాన పాత్రను పోషించిన ఆమె అత్యంత ప్రజాదరణ పొందారు. అప్పటికి మధుబాల వయసు 16 సంవత్సరాలే కావటం గమనార్హం. రొమాంటిక్, కామెడీ, డ్రామ్..ట్రాజెడీ వంటి పలు ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు మధుబాల. మొఘల్ ఈ అజమ్ అనే చారిత్రాత్మక చిత్రం మధుబాల కెరీర్‌లో గొప్ప చిత్రంగా చెప్పవచ్చు.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో మధుబాల హిట్ పెయిర్ తో బాక్సాఫీస్ కు కాసుల వర్షం కురిపించేది. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టేది. అయితే 1950లో ఆమెకి గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడ్డారు.ఆనాటి కాలంలో గుండెకు సంబంధించిన సమస్య అంటే చాలా పెద్దది పెద్దగా..వైద్య సదుపాయాలు కూడా లేకపోవటంతో కేవలం 36 ఏళ్ళ వయస్సులోనే మధుబాల గుండె సంబంధిత సమస్యతోనే మృతి చెందారు. హాలీవుడ్‌లో కూడా నటించాలని మధుబాల ఎన్నో కలలు కనేవారట.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి కాగా, నటీమణి దేవికా రాణి ఆమె నటనకు మరియు సామర్ధ్యానికి ముగ్దులై మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇవ్వటంతో ఆమె పేరు మధుబాలగా మార్చుకున్నారు. ముంతాజ్ మధుబాలగా మారారు. ముంతాజ్ యొక్క మొదటి చిత్రం బసంత్ (1942) బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం