Pathaan : భవిషత్తులో మీరు పోర్న్ సినిమాలు తీసిన ఆశ్చర్యపడనవసరం లేదు.. ముకేశ్ ఖన్నా!
షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా, ఈ మూవీపై చెలరేగిన వివాదం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవలే దీనిపై తీవ్ర విమర్శలు చేశాడు ఇండియన్ సూపర్ హీరో ‘శక్తిమాన్’ నటుడు ‘ముకేశ్ ఖన్నా’. తాజాగా మరోసారి ఈ సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Mukesh Khanna viral comments on Pathaan movie
Pathaan : షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా, ఈ మూవీపై చెలరేగిన వివాదం మాత్రం చల్లబడడం లేదు. ఈ చిత్రంలోని ‘బేషరం రంగ్’ సాంగ్ అభ్యంతరకర రీతిలో ఉందంటూ ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులతో సహా అందరూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే దీనిపై తీవ్ర విమర్శలు చేశాడు ఇండియన్ సూపర్ హీరో ‘శక్తిమాన్’ నటుడు ‘ముకేశ్ ఖన్నా’.
Pathaan: నాకు కనుక షారూఖ్ కనిపిస్తే అక్కడే దహనం చేస్తా.. అయోధ్య సాధువు క్రూర వ్యాఖ్యలు
తాజాగా మరోసారి ఈ సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. “బేషరం రంగ్ సాంగ్ లో అశ్లీలత ఉంది. అది మీ కళ్ళకి కనిపించడం లేదంటే, భవిషత్తులో మీరు పోర్న్ సినిమాలు తీసిన ఆశ్చర్యపడనవసరం లేదు. కాషాయ రంగు డ్రెస్‌లు వేసుకోవడమే కాకుండా ఆ రంగుని కించపరిచేలా లిరిక్స్ రాశారు. మీరు ఇంతలా చేస్తుంటే హిందువులు తిరగబడ్డారు అనుకుంటున్నారా? దీనికి మేము కచ్చితంగా ఎదురుతిరిగి నిలబడతాము” అంటూ మండిపడ్డాడు.
కాగా ఇటీవల సెన్సార్ బోర్డుకి వెళ్లిన ఈ సినిమాకి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూవీలోని కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ ని తొలిగించాలి అంటూ సూచించడంతో, కత్తెర్లు వేసే పనిలో పడింది మూవీ టీం. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, జాన్ అబ్రహాం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ కానుంది.