×
Ad

Dhurandhar 2 : ధురంధర్ సినిమాకి పెద్ద షాక్.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని..

నిర్మాణ సంస్థకి ఇప్పటికే ఆ కేసు నడుస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది. (Dhurandhar 2)

  • Published On : February 16, 2026 / 09:51 PM IST

Dhurandhar

Dhurandhar 2 : ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమా ఆల్మోస్ట్ 800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ ధురంధర్ 2 కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2 సినిమా మార్చ్ 19న రిలీజ్ కానుంది.(Dhurandhar 2)

అయితే పార్ట్ 2 కి సంబంధించి మిగిలిన కొంత షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పటికే ఈ షూటింగ్ విషయంలో అనుమతి లేని ఓ ప్రదేశంలో డ్రోన్స్ ఎగురవేశారని పోలీసులు FIR నమోదు చేసారు. నిర్మాణ సంస్థకి ఇప్పటికే ఆ కేసు నడుస్తుండగా తాజాగా మరో షాక్ తగిలింది.

Also Read Star Anchor : డబ్బుల కోసం ఒకప్పుడు గోల్డ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా.. ఇప్పుడు స్టార్ యాంకర్.. ఎమోషనల్ జర్నీ..

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దురంధర్ నిర్మాణ సంస్థ ఆదిత్యధర్ ప్రొడక్షన్ హౌస్ ని ఏకంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చూస్తుంది. ఇటీవల ఓ బిల్డింగ్ టెర్రస్ మీద పర్మిషన్ లేకుండా షూటింగ్ చేసినందుకు, పర్మిషన్ లేకుండా రెండు జనరేటర్ వ్యాన్స్ వాడినందుకు లక్ష రూపాయల వరకు ఫైన్ వేయాలని కూడా సూచించారు.

ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఓ రెండు వీధుల్లో ముంబై మున్సిపాలిటీ కొన్ని కండిషన్స్ తో ఈ సినిమా షూట్ కి పర్మిషన్స్ ఇచ్చారు. మండే పదార్థాలను వాడొద్దు అని కండిషన్ కూడా చెప్పారు. కానీ మూవీ యూనిట్ మండే పదార్థాలను, ఫేక్ బాంబ్స్ ని, కొన్ని పేలుడు పదార్థాలను వాడారు. అది కూడా అర్ధరాత్రి షూటింగ్ సమయంలో మండే పదార్థాలను వాడటంతో పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది.

Praneeta Patnaik : కేరాఫ్ కంచరపాలెం నటి.. ఇప్పుడు హాట్ హాట్ ఫోజులతో.. ప్రణీత పట్నాయక్ ఫోటోలు వైరల్..

ఫిబ్రవరి 13,14 తేదీల్లో కూడా పర్మిషన్ తీసుకొని మండే పదార్థాలు వాడటంతో గతంలో హెచ్చరించినా పట్టించుకోలేదని పోలీసులు కేసు నమోదు చేసారని సమాచారం. అలాగే మండే వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ముంబై మున్సిపాలిటీ పర్మిషన్ కోసం ఇచ్చిన డిపాజిట్ ని జప్తు చేసుకుంది.

ఈ సంఘటనల తరువాత రాష్ట్ర ఫిల్మ్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ద్వారా భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థకు ఎలాంటి చిత్రీకరణ అనుమతులు పొందకుండా శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేయాలని అక్కడి అధికారులు కోరారు. అలాగే ఇప్పటివరకు ఉల్లంఘించి చేసిన పనులకు జరిమానాలు విధించాలని కోరారు. దీంతో సినిమా రిలీజ్ ముందు దురంధర్ మూవీకి పెద్ద షాక్ తగిలింది.