Honey Rose : బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. అసభ్యంగా తాకుతూ..
Honey Rose : బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది.
honey rose faces bitter experience at shopping mall open in keralam
Honey Rose : గతంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతో నిధి అగర్వాల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరో బాలయ్య హీరోయిన్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సెల్ఫీల పేరుతో అభిమానులు ఆమెను అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హనీ రోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా హనీ రోజ్ కేరళలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన హనీ రోజ్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే వారితో సెల్ఫీ దిగే సమయంలో ఒక వ్యక్తి ఆమె నడుముపై చేతులు వేస్తూ కనిపించాడు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన హనీ రోజ్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అభిమానం పేరుతో సెలబ్రిటీలను వేధిస్తున్న పోకిరీలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం తగదంటున్నారు నెటిజన్లు.
సినిమాల విషయానికి వస్తే.. హనీ రోజ్ 2008లో విడుదలైన ‘ఆలయం’ సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’ (2014) చిత్రంలో నటించింది. దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత.. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య పక్కన మెరిసింది. ఈ చిత్రంతోనే హనీ రోజ్ టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది.
