Urfi Javed : ఉర్ఫీ జావేద్ అరెస్ట్ ఫేక్ అంట.. ఈసారి నిజంగా క్రిమినల్ కేసు నమోదు చేసిన ముంబై పోలీస్..

ముంబై మహిళా పోలీసులు(Mumbai Police) కాఫీ షాప్ వద్దకు వచ్చి రోడ్డు మీదే ఉర్ఫి జావేద్ ని అదుపులోకి తీసుకొని తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు.

Mumbai Police Filed Criminal Case on Urfi Javed For Fake Arrest Video

Urfi Javed : హిందీ బిగ్‌బాస్(Bigg Boss) తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న భామ ఉర్ఫీ జావేద్ ఆ తర్వాత తన విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది. డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్ గా బట్టలు వేసుకొని, అలాగే రోడ్ల మీదకి, జనాల్లోకి రావడంతో వైరల్ అవ్వడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది ఉర్ఫీ.

ఉర్ఫి జావేద్ విచిత్ర బోల్డ్ వేషధారణతో పలువురికి ఇబ్బంది కలుగుతున్నా, ఆమెని హెచ్చరించినా, ఆమెపై పోలీసు కేసులు పెట్టినా తాను మాత్రం మారట్లేదు. తాజాగా నిన్న నవంబర్ 3న ఎప్పటిలాగే ఓ కొత్త రకం డ్రెస్ వేసుకొని పొద్దున్నే కాఫీ తాగడానికి బయటకి వచ్చింది ఉర్ఫి. బాటమ్ జీన్స్, టాప్ బ్యాక్ మొత్తం కనపడేలా కేవలం ఫ్రంట్ కవర్ అయ్యేలా ఓ లవ్ షేప్ క్లాత్ కట్టుకొని వచ్చింది. అంతలో కొంతమంది ముంబై మహిళా పోలీసులు(Mumbai Police) కాఫీ షాప్ వద్దకు వచ్చి రోడ్డు మీదే ఉర్ఫి జావేద్ ని అదుపులోకి తీసుకొని తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని కాసేపు హడావిడి చేసింది ఉర్ఫి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై ముంబై పోలీసులు స్పందించారు.

Also Read : Madhubala Sky Diving : వయసుని లెక్క చేయకుండా స్కైడైవ్ చేసిన నటి మధుబాల

ముంబై పోలీస్ ఈ విషయంలో అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చీప్ పబ్లిసిటీ కోసం చట్టాల్ని ఉల్లంఘించకూడదు. ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఒక వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియో అంతా ఫేక్. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఫేక్. పబ్లిసిటీ కోసం ఈ వీడియో చేశారు. దీంతో ఆమెపై, పోలీస్ డ్రెస్, వెహికల్ మిస్ యూజ్ చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాం. ఇప్పటికే ఆ పోలీస్ వెహికల్ సీజ్ చేసి, పోలీస్ డ్రెస్ లో ఉన్నవారిని అరెస్ట్ చేశాం. మిగతా విచారణ చేస్తున్నాం. 171, 419, 500, 34 IPC సెక్షన్స్ పై ఆ మహిళపై క్రిమినల్ కేసు నమోదు చేశాము అని తెలిపారు.