Madhubala Sky Diving : వయసుని లెక్క చేయకుండా స్కైడైవ్ చేసిన నటి మధుబాల
Madhubala Skydiving Video: మణిరత్నం రోజా సినిమా పేరు గుర్తుకు వస్తే ఠక్కున నటి మధుబాల గుర్తొస్తారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న మధుబాల తాజాగా ఓ అడ్వంచర్ చేశారు. అదేంటో చదవండి.

Madhubala Sky Diving
ఫూల్ ఔర్ కాంటే.. రోజా సినిమాలు చూసిన వారు నటి మధుబాలను మర్చిపోరు. హిందీ, తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో సత్తా చాటిన ఈ నటి ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా 12వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి అందర్నీ అబ్బురపరిచారు.
Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు..
వయసు 54 ఏళ్లు..ఆ వయసులో ఎత్తైన ప్రదేశాలు ఎక్కడానికి కాస్త ఆలోచిస్తారు. అలాంటిది నటి మధుబాల 12,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నవంబర్ 1 న మధుబాల న్యూజిలాండ్ టౌపోలోని స్కై హై క్లబ్ తో 12,000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నుంచి స్కైడైవ్ చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
నిజానికి మధుబాలకి ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయమట. కాసేపు ఆ భయాల్ని పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట మధుబాల. తాను అన్ని మర్చిపోయి దూకేసానని.. క్రింద ఉన్న అద్భుతమైన మేఘాలు, పర్వతాలు, అగ్ని పర్వతాలు, సముద్రం వాటిని అంత ఎత్తునుంచి చూడటం అత్యంత అద్భుతమైన విషయం అన్నారు మధుబాల. భయం కారణంగా జీవితంలో కొందరు కొన్ని థ్రిల్స్ మిస్ అవుతుంటారు. భయాన్ని పక్కన పెడితే మధుబాలలాగ వయసుతో సంబంధం లేకుండా సరికొత్త అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. మధుబాల చేసిన ఫీట్ ప్రస్తుతం ఆమె అభిమానుల్ని వండర్ చేస్తోంది.
https://youtu.be/GkWlDx0fnlI