Music Director Anirudh Grandfather SV Ramanan Passed Away at age of 87
SV Ramanan : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తాత, సీనియర్ డైరెక్టర్, రేడియో కళాకారుడు, నటుడు ఎస్వీ రమణన్ 87 ఏళ్ళ వయసులో కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Rahul Dev : నన్ను మర్చిపోయారు.. అవకాశాలు లేక ఇలా టీవీ షోలకి వస్తున్నా..
దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, రేడియో కళాకారుడిగా ఎస్‌వీ.రమణన్ ఎన్నో సేవలు అందించారు. ఎస్వీ రమణన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియచేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.