Rahul Dev : నన్ను మర్చిపోయారు.. అవకాశాలు లేక ఇలా టీవీ షోలకి వస్తున్నా..

తాజాగా రాహుల్ దేవ్ ఓ బాలీవుడ్ టీవీ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. ''మా కుటుంబంలో జరిగిన ఓ విషాదం వల్ల కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంటూ................

Rahul Dev : నన్ను మర్చిపోయారు.. అవకాశాలు లేక ఇలా టీవీ షోలకి వస్తున్నా..

Villain Rahul Dev emotional while says about his career and personal life

Updated On : September 27, 2022 / 10:37 AM IST

Rahul Dev :  సినీ పరిశ్రమలో కొన్ని రోజులు గ్యాప్ వస్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. సినీ పరిశ్రమకి దూరమై మళ్ళీ తిరిగి వద్దామనుకున్నా అవకాశాలు అంత తొందరగా రావు. ఇప్పటికే చాలా మంది నటీనటులు దీనిని ఎదుర్కొన్నారు. తాజాగా ఓ స్టార్ విలన్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. తెలుగులో సింహాద్రి, ఆంధ్రావాలా, జై చిరంజీవ, మున్నా, మాస్‌, అతడు, ఎవడు, లౌక్యం, నాయక్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు రాహుల్ దేవ్.

తెలుగు మాత్రమే కాక హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా విలన్ గా నటించారు రాహుల్ దేవ్. ఓ దశలో స్టార్ విలన్ గా ఎదిగి చాలా బిజీగా మారారు. కానీ రాహుల్ దేవ్ భార్య సడెన్ గా చనిపోవడంతో పిల్లల సంరక్షణ కోసం కొన్ని రోజుల పాటు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఆ సమయంలో చాలా రేర్ గా రెండో, మూడో హిందీ సినిమాల్లో నటించారు. సినీ పరిశ్రమకి దూరమవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

Vivek Agnihotri : బాయ్‌కాట్‌ ట్రెండ్ మంచిదే.. అలా అయినా మారతారేమో..

తాజాగా రాహుల్ దేవ్ ఓ బాలీవుడ్ టీవీ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. ”మా కుటుంబంలో జరిగిన ఓ విషాదం వల్ల కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంటూ చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేశాను. సినీ పరిశ్రమలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి. అందుకే నన్ను కూడా త్వరగానే మర్చిపోయారు. ఇన్ని సినిమాల్లో నటించిన నేను ఇప్పుడు తప్పక టీవీ షోలో పాల్గొనాల్సి వస్తుంది. నేను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సునీల్‌ శెట్టి, దర్శకులు నిఖిల్‌ అద్వానీ, అనీస్‌ బాజ్మీ లాంటి మిత్రులు నాకు సపోర్ట్ చేశారంటూ” ఎమోషనల్ అయ్యారు. మరి ఈ విషయం తెలిసిన తర్వాతైనా రాహుల్ దేవ్ కి ఇదివరకులా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.