Vivek Agnihotri : బాయ్‌కాట్‌ ట్రెండ్ మంచిదే.. అలా అయినా మారతారేమో..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో చాలా మంది హీరోలు, దర్శకులు సినిమా అంటే ఫార్ములా, ప్యాకేజీ అని ఓ కమర్షియల్ మూసలో కొట్టుకుపోతున్నారు. పాత కథలనే మార్చి మార్చి

Vivek Agnihotri : బాయ్‌కాట్‌ ట్రెండ్ మంచిదే.. అలా అయినా మారతారేమో..

Vivek Agnihotri :  ఇటీవల కొన్ని రోజులు బాలీవుడ్ లో బాయ్‌కాట్‌ ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలని, నటుల్ని బాయ్‌కాట్‌ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. సినిమా వాళ్ళు చెప్పుకోకపోయినా ఈ బాయ్‌కాట్‌ వల్ల కొన్ని సినిమాలకి భారీగానే నష్టం చేకూరింది. చాలా మంది బాలీవుడ్ నటులు ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్ కి భయపడ్డారు. కొంతమంది నటులు అయితే ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్ పై సీరియస్ అయ్యారు. తాజాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం బాయ్‌కాట్‌ ట్రెండ్ ని సపోర్ట్ చేశారు.

బాలీవుడ్ లో రెండు వర్గాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. స్టార్ యాక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవర్ని రానివ్వరు, వాళ్ళే రూల్ చేస్తారని వాళ్లంతా బాలీవుడ్ మాఫియా అని కొంతమంది దర్శకులు, హీరోయిన్స్, నటులు వారిని ఉద్దేశించి ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ మాఫియా అంటూ కౌంటర్లు వేస్తారు. తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా బాలీవుడ్ మాఫియాని విమర్శిస్తూనే బాయ్‌కాట్‌ ట్రెండ్ కి సపోర్ట్ గా మాట్లాడారు.

Neha Chowdary : రేవంత్ వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను.. రివేంజ్ అవకాశం వస్తే వదలను..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ”బాలీవుడ్ లో చాలా మంది హీరోలు, దర్శకులు సినిమా అంటే ఫార్ములా, ప్యాకేజీ అని ఓ కమర్షియల్ మూసలో కొట్టుకుపోతున్నారు. పాత కథలనే మార్చి మార్చి జనాల మీదకు వదులుతున్నారు. అందుకే ప్రేక్షకులు విసిగిపోయి ఇలాంటి బాయ్‌కాట్‌ ట్రెండ్స్‌ తీసుకొస్తున్నారు. ఒకందుకు ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్ మంచిదే. కనీసం ఇలా బాయ్‌కాట్‌ ట్రెండ్ చేయడం వల్ల అయినా మారి మంచి సినిమాలు వస్తాయేమో చూడాలి. ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్ భవిష్యత్తులో బాలీవుడ్ కి మంచి ఫలితాన్నే ఇస్తుందని నమ్ముతున్నాను. నేను మాత్రం ఒకరి ప్రచారం కోసం అలాంటి కమర్షియల్ సినిమాలు తీయను” అని అన్నారు.

బాలీవుడ్ అంతా బాయ్‌కాట్‌ ట్రెండ్ ని వ్యతిరేకిస్తూ, విమర్శలు చేస్తుంటే తాజాగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాయ్‌కాట్‌ కి సపోర్ట్ గా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.