Prabhas – Spirit : దీపావళి రోజు ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

తాజాగా నేడు దీపావళి రోజు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ సినిమా అప్డేట్ ఇచ్చాడు.

Music Director Harshavardhan Rameshwar gives Prabhas Spirit Update

Spirit : ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ కొట్టి ఇంకో అరడజను పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో వచ్చి భయపెట్టి నవ్వించనున్నాడు ప్రభాస్. ఆ తర్వాత హను రాఘవపూడి సినిమా, సలార్ 2, కల్కి 2, స్పిరిట్.. ఇలా పెద్ద లైనప్ పెట్టాడు.

అయితే ఫ్యాన్స్ వీటిల్లో స్పిరిట్ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బోల్డ్ సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ కావడం, ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్ అని చెప్పడంతో రెబల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూట్ మొదలవ్వనుంది. అయితే తాజాగా నేడు దీపావళి రోజు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ సినిమా అప్డేట్ ఇచ్చాడు.

Also Read : Game Changer : లుంగీ కట్టిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడో తెలుసా.. కొత్త పోస్టర్ రిలీజ్..

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెట్టాడు సందీప్ రెడ్డి వంగ. మ్యూజిక్ ప్లే చేస్తూ అది హర్షవర్ధన్, సందీప్ వింటున్న చిన్న వీడియోని హర్షవర్ధన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ వీడియో షేర్ చేసి స్పిరిట్ మ్యూజిక్ వర్క్స్ మొదలుపెట్టాము అని తెలిపాడు హర్షవర్ధన్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అవ్వగా, ఇప్పుడు మ్యూజిక్ అయిపోతే త్వరలోనే స్పిరిట్ షూట్ మొదలుపెడతారని భావిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.