Game Changer : లుంగీ కట్టిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడో తెలుసా.. కొత్త పోస్టర్ రిలీజ్..
తాజాగా నేడు దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.

Ram Charan Game Changer Movie Teaser Update with New Poster
Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మూవీ యూనిట్ యాక్టివ్ అయి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి వైరల్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కాబోతుంది.
తాజాగా నేడు దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ పోస్టర్ వైరల్ గా మారగా టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో పట్టాలపై విలన్ మనుషులని రామ్ చరణ్ కొట్టి పడినట్టు తెలుస్తుంది. చరణ్ మాస్ లుక్ లో లుంగీ కట్టి వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ తెగ వైరల్ చేస్తున్నారు.
Happy Diwali Folks 😎💥
Celebrate #GameChangerTeaser from Nov 9th 🧨🔥#GameChanger In cinemas near you from 10.01.2025! pic.twitter.com/Y5pbNNftdu
— Game Changer (@GameChangerOffl) October 31, 2024